
గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమే
● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: రాహుల్‌గాంధీ ఓట్ చోరీ అంటూ డ్రామాలు చేస్తున్నారని, ఇటలీ నుంచి వచ్చి గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ 11 ఏళ్ల సుపరిపాలన ఓర్వలేక రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనామ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నగరంలోని శ్రీరామగార్డెన్‌లో సోమవారం నిర్వహించే జిల్లా బూత్‌స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఒక గూటి పక్షులని, ఇద్దరూ కులం, వర్గం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి, సమగ్రత, సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్‌రెడ్డి, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: నగరంలోని ఖలీల్‌వాడిలో ఏర్పాటు చేసిన వన్ వేతో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎంఏ అసోసియేషన్, మున్సిపల్, డీఎంఅండ్‌హెచ్‌వో లతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ట్రాఫిక్ సిబ్బంది వన్ వేను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఖలీల్‌వాడి ప్రవేశ మార్గం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్ ఎంట్రీ వద్ద నుంచి ఉందని, బయటకు వెళ్లాలంటే గ్రంథాలయం ముందు నుంచి, వెల్నెస్ హాస్పిటల్ పక్కనపున్న నలంద కాలేజీ ముందు, ఇతర మార్గాల నుంచి ఉందన్నారు. వాహన దారులకు వన్ వే ఎంట్రీ, ఎగ్జిట్ రూట్ మ్యాప్, ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు, ప్రజలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని కోరారు.

గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమే