‘సాగర్‌’ గేట్లు మూసివేత | - | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’ గేట్లు మూసివేత

Aug 24 2025 2:24 PM | Updated on Aug 24 2025 2:24 PM

‘సాగర

‘సాగర్‌’ గేట్లు మూసివేత

నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో శనివారం మధ్యాహ్నం నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈనెల 18 నుంచి శనివారం ఉదయం వరకు ఆరు రోజుల పాటు నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శనివారం సాయంత్రం 13,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,404 అడుగుల (16.357 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

అవినీతిపై ఆరా

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా విద్యాశాఖలో అవినీతి వ్వవహారంపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ‘విద్యాశాఖలో ఏసీబీ గుబులు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఏసీబీ అధికారులు కేజీబీవీల్లో ఇటీవల జరిగిన నిధుల ఖర్చుల, లర్నింగ్‌ మెటిరియల్‌, నోట్‌ పుస్తకాల పంపిణీపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా అధికారులు మీ నుంచి డ బ్బులు వసూలు చేశారా? అని కేజీబీవీ ప్రత్యేకాధికారులను ఫోన్‌లో ప్రశ్నించారు. మాక్లూర్‌ కేజీబీలో భారీగా అవినీతి జరిగినట్లు కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే వేసవి శిక్షణకుసంబంధించిన నిధులు కాజేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇ దిలా ఉండగా ‘సాక్షి’ కథనంపై స్పందించిన విద్యాశాఖ అధికారులు నిధులు సక్రమంగా నే వినియోగించినట్లు పేర్కొన్నారు. కో ఆర్డినేటర్ల బిల్లుల మేరకే నిధులు విడుదల చేశా మని డీఈవో అశోక్‌ ప్రకటనలో తెలిపారు.

ఫెర్టిలైజర్స్‌

దుకాణాల్లో తనిఖీలు

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల బ్యాగులపై ఉన్న ధరలు, ప్యాకింగ్‌ తేదీలతో పాటు ఇతర వివరాలను పరిశీలించారు. లీగల్‌ మెట్రాలజీ నిబంధనల ప్రకారం లేని ఎరువుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ తూనికల కొలతల అధికారి సందీప్‌ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మూడు దుకాణలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సీఎంసీ వద్ద ఉద్రిక్తత

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): డిచ్‌పల్లి క్రిస్టి యన్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి వద్ద శని వా రం ఉద్రిక్తత నెలకొంది. సీఎంసీ చైర్మన్‌ హో దాలో వచ్చిన షణ్ముక మహాలింగంను సె క్యూరిటీ సిబ్బంది శనివారం లోనికి రాకుండా అడ్డుకున్నారు. మెయిన్‌ గేటుకు తాళం వేసి ఉండటంతో తెరవాలని మహాలింగం చెప్పినా సెక్యూరిటీ పట్టించుకోలేదు. డైరెక్టర్‌ డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌, చైర్మన్‌ షణ్ముక మహాలింగం మధ్య గత కొన్ని రోజులుగా సీఎంసీ నిర్వహణపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అజ్జ శ్రీనివాస్‌ను డైరెక్టర్‌గా తొలగించి కొత్త డైరెక్టర్‌గా జేఎన్‌ రావును నియమించినట్లు షణ్ముక లింగం కొద్ది రోజుల క్రి తం తెలిపారు. అయినప్పటికీ అజ్జ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది ష ణ్ముక మహాలింగంను లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన మహాలింగం గేటు తాళాలు పగులగొట్టి లోనికి వెళ్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ షరీఫ్‌ సిబ్బందితో సీఎంసీ వద్ద కు చేరుకున్నారు. మహాలింగంతోపాటు జేఎ న్‌ రావును స్టేషన్‌కు తరలించారు. సీఎస్‌ఐ మెడికల్‌ ట్రస్ట్‌ వారితో ఒప్పందం కుదుర్చున్నందున వారిని ఇక్కడికి పిలిపించాలని, అప్పుడే ఎవరు సీఎంసీకి బాధ్యులో తేలుతుందని అంతవరకు ఎలాంటి గొడవలు చేయవద్దని ఎస్సై సూచించారు. ఈ సంద ర్భంగా మహాలింగం మాట్లాడుతూ.. అజ్జ శ్రీనివాస్‌ నేపాల్‌ దేశ డూప్లికేట్‌ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా కొనసాగుతున్నారని, సీఎంసీ విషయంలో లీగల్‌గా తేల్చుకుంటానన్నారు.

‘సాగర్‌’ గేట్లు మూసివేత 
1
1/1

‘సాగర్‌’ గేట్లు మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement