
ఫైర్ హుషార్
ఖలీల్‌వాడి: ఆపదలో ఆదుకునే అగ్నిమాపకశాఖకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చా యి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే రెస్క్యూ, రిమోట్ బోట్లు ఆపరేటింగ్ చేసే విధానంపై జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువులో ప్రతి శుక్రవారం సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ల్లోని 12 ఫైర్‌స్టేషన్‌లకు చెందిన 20 మంది సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. శిక్షణ పొందుతున్న వారిలో గాంధారి, భీమ్‌గల్ ఫైర్ స్టేషన్‌ల అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం ఉన్నారు.
రిమోట్ బోట్ ప్రత్యేకం
సరికొత్తగా రిమోట్ బోటును అందుబాటులోకి తెచ్చి అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఒకప్పుడు నీటిలో పడినవారిని కాపాడేందుకు పడవ, బోట్‌ను ఉపయోగించే వారు.
ఇప్పుడు నీటిలో చిక్కుకున్న వారివద్దకు ఒడ్డునే ఉండి రిమోట్ సాయంతో బోట్‌ను పంపించి కాపాడొచ్చు. ఒడ్డున ఉండి 800 మీటర్ల దూరం వరకు నీటిలో బోట్‌ను పంపించి బాధితులను రక్షించే అవకాశముంది.
ప్రతి శుక్రవారం శిక్షణ
జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ చెరువులో ఉమ్మడి జిల్లాకు చెందిన 20మంది అగ్నిమాపక సిబ్బందికి ప్రతి శుక్రవారం శిక్షణ ఇస్తున్నాం. ఇన్‌ఫ్ల్లటబుల్ రెస్క్యూ, రిమోట్ బోట్లు వాడి వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలో శిక్షణ ఇచ్చాం. వరదలు, వినాయక నిమజ్జనం వంటి సందర్భాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను ఉపయోగిస్తాం.
– పరమేశ్వర్, జిల్లా ఫైర్ అధికారి, నిజామాబాద్
రెస్క్యూ బోటులో రిస్క్ చేయడం
శిక్షణలో అతి ముఖ్యమైనది రెస్క్యూబోట్ ఆపరేటింగ్. ప్రస్తుతం సిబ్బంది శిక్షణ పొందుతున్న బోటును ఎక్కువ మంది బాధితులను, ఎక్కువ బరువును మోసే విధంగా రూపొందించారు. దీనిద్వారా ఒకేసారి 8 నుంచి 10 మందిని కాపాడొచ్చు. అవుట్ బోల్ట్ మోటార్‌ను బిగించి రెస్క్యూబోట్ నడుపుతారు. ప్రస్తుతం 40 హెచ్‌పీ మోటారు వాడుతున్నారు.
అగ్నిమాపకశాఖకు ఆధునిక పరికరాలు
ఎనిమిది మందిని ఒకేసారి
రక్షించే రెస్క్యూ బోట్
ఉమ్మడి జిల్లాలోని 20 మంది
ఫైర్ సిబ్బందికి శిక్షణ