
వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్ డివిజన్‌లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు చేశా రు. అనుమతులు, రిజిస్ట్రేషన్‌లు లేకుండా ఫైనాన్స్‌లు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారనే ఫిర్యాదుల నేప థ్యంలో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది వడ్డీ వ్యాపారుల, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయా ల్లో తనిఖీలు చేపట్టారు. సామాన్యుల అవసరాన్ని ఆసరా చేసుకుని అధిక వడ్డీ వ సూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నిజామాబాద్ డివిజన్‌లోని ఓ పో లీస్‌స్టేషన్ పరిధిలోని ఒక్క గ్రామంలోనే సు మారు రూ.2 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు లభించినట్లు ప్రచారంలో ఉంది. అలాగే నిజామాబాద్‌లో 99, ఆర్మూర్‌లో 5 ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
బోధన్‌లో..
బోధన్‌టౌన్: బోధన్‌లోని ఆరు ఫైనాన్స్ కార్యా లయాలపై దాడులు చేసి ప్రామిసరీ నోట్లు, రసీదు లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.
నిజామాబాద్‌లో స్వాధీనం చేసుకున్న నగదు రూ.1,21,92,750
పోలీసులు స్వాధీనం చేసుకున్న చెక్కులు, ప్రామిసరీ నోట్లు
రూ.కోట్ల లావాదేవీలకు
సంబంధించిన చెక్కులు..
ప్రామిసరీ నోట్లు, బాండ్
పేపర్లు స్వాధీనం
రూ.1.21 కోట్ల నగదు సీజ్
శనివారం తెల్లవారు జాము నుంచి
సాయంత్రం వరకు తనిఖీలు