
ఓటరు లిస్ట్‌లో పొరపాట్లు ఉండొద్దు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): ఓటరు జాబితాను పరిశీలించి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మోపాల్ మండలకేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌తోపాటు ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలను శనివారం రాత్రి ఆయన సందర్శించారు. స్థాని క సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పోలింగ్ సామగ్రిని పరిశీలించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
అనంతరం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్ సరితతో మాట్లాడి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోపాల్‌లోని బీసీ బాలుర హాస్టల్, ముదక్‌పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహాన్ని కలెక్టర్ తనిఖీచేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. రాత్రి భోజనంలో అందించిన ఆహా ర పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా, భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్, కిచెన్, స్టోర్‌రూమ్‌లను తనిఖీ చేసి వార్డెన్ వద్ద వివరాలు ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్‌ఐ రాజేశ్వర్, ఎంపీవో కిరణ్‌కుమార్, ఎస్‌ఈ ప్రదీప్ తదితరులు ఉన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు
సిద్ధంగా ఉండాలి
భూభారతి దరఖాస్తులను
త్వరితగతిన పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు