
పట్టు పట్టి.. పీహెచ్‌డీ సాధించి..
● కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు మోస్తూనే పరిశోధనలు
● సమాజానికి మేలు చేసే అంశాలతో..
● డాక్టరేట్ పట్టా అందుకున్న
మహిళా‘మణులు’
ఓవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ.. మరోవైపు ఉద్యోగం చేస్తూ.. ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి విజయం సాధించారు ఆ మహిళామణులు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మహిళలు తెలంగాణ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో తాము ఎంచుకున్న అంశంపై పరిశోధన చేశారు. ఇటీవల యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా ప నిచేస్తున్న స్రవంతి తెయూ లో పీహెచ్‌డీ చేశారు. పోక్సో చట్టంపై జిల్లా లోని కౌ మార బాలబాలికలకున్న అవగాహన స్థాయిని అ ధ్యయనం చేసి పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ యూ నివర్సిటీ సౌత్‌క్యాంపస్ సోషల్ వర్క్ విభాగంలో విజయ్‌కుమార్ శర్మ పర్యవేక్షణ లో ఆమె పరిశోధన సాగింది. ఇటీవల జరిగిన తెయూ స్నాతకోత్సవంలో ఆమె డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

పట్టు పట్టి.. పీహెచ్‌డీ సాధించి..