
పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో లోవోల్టేజీ దూరం
● ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌రావు
వేల్పూర్: మోతె విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో గ్రామంలో కరెంటు సమస్యలు తీరుతాయని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌రావు పేర్కొన్నారు. శనివారం పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఉన్న రెండు 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌లు గ్రామంలో పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు సరిపోకపోవడంతో అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులు కోరిన అదనపు ఫీడర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌ఈ, అధికారులను వీడీసీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్ డీఈ రాజేశ్వర్‌రావు, భీమ్‌గల్ ఏడీఈ వినోద్‌కుమార్, వేల్పూర్ ఏఈ యశ్వంత్‌రావు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఉచిత శిక్షణ కోర్సులకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 28 నుంచి టైలరింగ్ (31 రోజులు), మగ్గం వర్క్ (31 రోజులు), సెప్టెంబర్ 5 నుంచి బ్యూటీపార్లర్ (35 రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణతోపాటు భోజన, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉన్న గ్రామీణ ప్రాంత మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08461–295428 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
సిర్నాపల్లిలో అగ్ని ప్రమాదం
● తప్పిన ప్రాణాపాయం
ఇందల్వాయి: సిర్నాపల్లి గ్రామంలో మరకల రాజు ఇంట్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు దుబాయిలో ఉండగా అతని భార్య, తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఉదయం ఒక్కసారిగా చెలరేగిన మంటలను గమనించిన స్థానికులు గన్నారం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక శాఖ అధికారి విక్రమ్ తెలిపారు. ప్రమాదంలో నిత్యావసర సరుకులతోపాటు రూ.1.50లక్షల నగదు, సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు కాలిబూడిదైనట్లు ఆర్‌ఐ మోహన్ తెలిపారు.

పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో లోవోల్టేజీ దూరం