
దివ్యాంగులకు సమాన అవకాశాలు
ఆర్మూర్: దివ్యాంగ విద్యార్థులకు అన్ని రంగాల్లో స మాన అవకాశాలు ఉంటాయని జిల్లా విద్యాఽ దికారి పార్శి అశోక్ పేర్కొన్నారు. దివ్యాంగుల సేవ ను తల్లిదండ్రులు, సహిత విద్యావిభాగం ఉద్యోగులు బరువుగా భావించకుండా బాధ్యతగా భావించాల ని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని సీఎస్‌ఐ కాంపౌండ్‌లో ఉన్న హెచ్‌పీడీ బధిరుల ఆశ్రమ పాఠ శాలలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా సహిత విద్యా విభాగం, అలీంకో సంయుక్తంగా దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల కోసం లబ్ధిదారుల గు ర్తింపు శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందజేస్తున్న అలీంకోను అభినందించారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గతేడాది జిల్లా వ్యాప్తంగా 294 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కార్య క్రమంలో ఎంఈవో రాజగంగారాం, మెడికల్ ఆఫీస ర్ డాక్టర్ ఫిర్దౌస్ ఫాతిమా, బధిరుల పాఠశాల మేనేజర్ సువర్ణ కిరీటి, ప్రిన్సిపల్ శాంతమూర్తి, అలీంకో నిపుణులు రుక్మిణి, ఓం ద్వివేది, నర్సింగ్ ఆఫీసర్ ర జిత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, ఐఈఆర్‌పీలు పాల్గొ న్నారు. అంతకుముందు 250 మందిని పరీక్షించి అందులో 150 మందిని అర్హులుగా గుర్తించారు.
డీఈవో అశోక్