
తప్పిన ఇంటర్నెట్ తిప్పలు
● 80 రైతు వేదికల్లో మోడెంల ఏర్పాటు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలు ఉండగా ప్రభుత్వం 80 చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సదుపా యం కల్పించింది. ఐతే, ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో ఏఈవో, ఏవోలు మొబైల్ ఫోన్ నుంచి హాట్‌స్పాట్ ద్వారా ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగే వీడి యో కాన్ఫరెన్స్‌ను కొనసాగించాలంటే మొబైల్ ఫోన్లలో డేటా సరిపోయేది కాదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. వీడియో కాన్ఫరెన్స్ ఉన్న రైతు వేదికల్లో స్థానిక నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఇంటర్నెట్ మోడెంలను పెట్టించింది. కాగా, రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని ఏఈవోలు కోరుతున్నారు.
సుభాష్‌నగర్: నగర శివారులోని శ్రీ రామగార్డెన్‌లో సోమవారం నిర్వహించే జిల్లా బూత్‌స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న రాంచందర్‌రావుకు ఘన స్వాగతం పలికేలా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆయనకు ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద స్వాగతం పలకనున్నారు. అనంతరం కంఠేశ్వర్ ఆలయంలో పూజలు చేసి సమావేశ ప్రాంగణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం బీజేపీ కార్యాలయంలో జరిగే జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పా ల్గొననున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అర్వింద్ ధర్మపురితోపాటు ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరుకానున్నారు.