
మోతీరాంనాయక్ తండాలో ఉద్రిక్తత
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని బైరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మోతీరాంనాయక్ తండాలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీభూమిలో పంట సాగుచేయడంతో ఫారెస్టు అధికారులు పంటకు గడ్డి మందు పిచికారి చేయడంతో అధికారులకు, గిరిజనులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఓ రైతు ఆ త్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. తండా కు చెందిన ప్రకాశ్ అనే గిరిజన రైతు అటవీ భూమి లోని 3ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నా డు. ఏప్రిల్ 29న రైతు ఆ భూమి చదును చేయగా, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు రావడంతో చదును చేయవద్దన్నారు. అవేమీ పట్టించుకోకుండా సదరు రైతు పంట సాగుచేయడంతో మేలో నోటీసులిచ్చా రు. అయినా అతడు స్పందించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్‌ఆర్‌వో రాధిక స మక్షంలో ఫారెస్ట్ అధికారులు గడ్డి మందు స్ప్రే చేశా రు. వెంటనే అధికారులను ప్రకాష్ కుటుంబంతోపాటు గిరిజనులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని, ఆ తర్వాత పంట వేయబో మని నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రెండెకరాల్లో మందును స్ప్రే చేసినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. చేతికొచ్చిన పంటను అధికారులు నాశనం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ప్రకాష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనను వెంటనే నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ప్రకాశ్ గడ్డి మందు తాగలేదని, తమను బెదిరించేందుకు అలా చేశారని ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీభూమిని సాగుచేయడమే కాకుండా ఫారెస్టు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు రైతు ప్రకాష్, అతడి భార్య కవిత, బంధువైన జలెందర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అటవీ భూమిలో వేసిన మొక్కజొన్న
పంటకు గడ్డిమందు స్ప్రేకు
ఫారెస్టు అధికారుల యత్నం
అడ్డుకున్న గిరిజనులు
మనస్తాపంతో గడ్డి మందు తాగిన రైతు!