
చేయూత పెన్షన్ పెంచాలి
పెర్కిట్(ఆర్మూర్): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హా మీ మేరకు వెంటనే చేయూత పెన్షన్‌ను పెంచి, అర్హులకు అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆర్మూ ర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో మంగళవారం మహాగర్జన సన్నాహక సభ నిర్వహించారు. ఈసందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చే యూత పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలు, వికలాంగుల పింఛన్లను రూ.4 వేల నుంచి రూ.6 వేలు పెంచుతామని హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పింఛన్ పెంపు విషయంలో ముఖం చాటేస్తున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే నెంబరు వన్ మోసగాడని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నంబరు వన్ అసమర్థ నాయకుడని అన్నారు. పించను పెంచే విషయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికే హైదరాబాద్‌లో ఈ నెల 13న చేయూత, వికలాంగుల పింఛన్‌దారులతో మహాగర్జన సభ చేపడుతున్నట్లు వెల్లడించారు. సభను ప్రజలు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు సుజాత సూర్యవంశీ, బీరప్ప, సలీం, ఖలీం, స్వామి, పోశెట్టి, బా లు, కనక ప్రమోద్, రాజేశ్, స్వామి దాస్, శ్యామ్, కృష్ణవేణి, సరిత, గంగాధర్ పాల్గొన్నారు.