
ఆగమవుతున్న లక్ష్మి ఆయకట్టు
బాల్కొండ: సాగునీటి కోసం ఎస్సారెస్పీ ప్రధాన కాలువల్లో ఒకటైన లక్ష్మి కాలువ ఆయకట్టు రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంటల సాగు తోపాటు చెరువులు నింపేందుకు 2 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, ప్రాజెక్టులో అవసరానికి అ నుగుణంగా నీరున్నా లక్ష్మి కాలువకు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో నీటివిడుదల ప్రారంభమయ్యేదని, ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన తమ పరిస్థితి ఈ ఏడాది అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రా జెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్యుల చొప్పున నీటిని విడుదల చేయాలని పాలకులు అధికారులపై ఒత్తిడి తెస్తుండగా, ఆయకట్టు రైతులు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల పరిధిలో కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికే 70 నుంచి 80 శాతం నాట్లు పూర్తికాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా మరో 20 శాతం భూముల్లో నాట్లు ఇప్పటికీ పూర్తికాలేదు. అయితే నాట్లు పూర్తయిన భూములకు నీరందకపోవడంతో అక్కడక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటు వర్షాలు కురవక, అటు ఎస్సారెస్పీ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీరందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అవసరం మేరకు నీరున్నా..
లక్ష్మి ఆయకట్టు పరిధిలోని 50వేల ఎకరాల్లో పంటలు గట్టెక్కడంతోపాటు చెరువులను నింపేందుకు 2 టీఎంసీల నీరు సరిపోతుందని ప్రాజెక్టు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపడితే పెద్దగా ప్రాజెక్ట్‌లో నీరు అందకుండా పోయే ప్రమాదమేమీ ఉండదు. కాకతీయ కాలువ ద్వారా నిరంతరం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, అటువంటప్పుడు లక్ష్మికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే తప్పేమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు.
లక్ష్మి కాలువ
ఎస్సారెస్పీ నుంచి విడుదల కాని నీరు
కాలువ కింద ఇప్పటికీ
పూర్తికాని నాట్లు..
వేసిన నాట్లు ఎండిపోయే పరిస్థితి
ప్రాజెక్టులో ప్రస్తుతం
40.5 టీఎంసీల నీటి నిల్వ
ఆయకట్టుకు 2 టీఎంసీలే అవసరం..
కొత్త లొల్లి..
పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మి కాలువకు ప్రస్తుతం అనధికారికంగా కొంత నీరు విడుదలవుతోంది. అయితే ఇది ఎక్కడా రికార్డులో నమోదు కావ డం లేదు. అనధికారికంగా విడుదలవుతున్న నీ రు చాలామట్టుకు ఆవిరవుతోంది. డీ3 వరకు అరకొరగా నీరందుతుండగా, డీ4 ఆయకట్టు రై తులకు అసలే లేదు. ముప్కాల్ మండలం న ల్లూర్ వాసులు ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ గ్రామాన్నే కోల్పోయామని గ్రామ శివారులోని కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని చెరువులోకి మ ళ్లించుకుంటున్నారు. దీంతో కొత్త లొల్లి షురూ అయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నా రు. లక్ష్మి కాలువ నిర్వహణ మైనర్ ఇరిగేషన్ (బాల్కొండ శాఖ) పర్యవేక్షిస్తుంది. నీరు మా త్రం ప్రాజెక్ట్ అధికారుల కంట్రోల్‌లో ఉంటుంది. పాలకులు స్పందించి నీటిని విడుదల చేసే లా చర్యలు తీసుకోవాలని, లేకుంటే జల వివా దాలు తలెత్తుతాయని రైతులు అంటున్నారు.
వెంటనే నీటిని విడుదల చేయాలి
లక్ష్మికాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలి. కాలువలో ఇప్పుడు వదులుతున్న నీరు చివరాయకట్టు వరకు రావడం లేదు. దీంతో వరి నాట్లు వేయలేక పోతున్నాం. కొన్ని నీళ్లు ఎందుకు ఇస్తున్నారు. కాలువలోనే ఇంకి పోతున్నాయి. పంటలను కాపాడేందుకు నీళ్లు వదలాలి.
– ఆకుల రాజన్న, ఆయకట్టు రైతు

ఆగమవుతున్న లక్ష్మి ఆయకట్టు