నిజాంసాగర్‌ నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌ నీటి విడుదల

Aug 6 2025 6:20 AM | Updated on Aug 6 2025 6:20 AM

నిజాం

నిజాంసాగర్‌ నీటి విడుదల

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మంగళవారం నీటి విడుదల చేపట్టినట్లు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్‌ తెలిపారు. 600 క్యూసెక్కుల చొ ప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటిని ఆయకట్టు ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎస్సారెస్పీకి తగ్గిన వరద

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుము ఖం పట్టింది. ప్రాజెక్ట్‌లోకి 4,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.30(40.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

ఎత్తిపోతల ద్వారా

నీటిని విడుదల చేయాలి

నిజామాబాద్‌ సిటీ: అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల ద్వారా కావాల్సిన నీటిని ప్రభుత్వం విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు వరి నాట్లు వేశారని, సకాలంలో వర్షాలు పడక వరి నాట్లు ఎండిపోతు న్నాయన్నారు. అధికారులు ప్రతి ఏడాది జూ న్‌, జూలైలో అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేవారని, ఈ ఏ డాది ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి నీటిని విడు దల చేయాలని కోరారు. నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, హగ్గు ఎర్రన్న, బోరిగాం సాయి లు, రాపాని గంగాధర్‌, సాయి పాల్గొన్నారు.

ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

డిచ్‌పల్లి: సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లను స ద్వినియోగం చేసుకుని చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు డీఈవో అశోక్‌ సూచించారు. వ్యాపారవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి సహకారంతో రూ.2.5 లక్షల వ్యయంతో ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన సైన్స్‌, కంప్యూటర్‌ ల్యా బ్‌ను డీఈవో మంగళవారం ప్రారంభించా రు. ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, గెజిటెడ్‌ హెచ్‌ఎం సీతయ్య, మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌, గంగాధర్‌, అమ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ సావిత్రి, ఉపాధ్యాయులు, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సందర్శించారు. ల్యా బ్‌లను పరిశీలించి తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు.

ఎంఈడీ పరీక్ష ఫీజు

చెల్లించండి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధి లోని ఎంఈడీ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లా గ్‌ పరీక్ష ఫీజును ఈనెల 18 వరకు చెల్లించాల ని కంట్రోలర్‌ సంపత్‌కుమార్‌ ఒక ప్రకటన లో తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో జరగబోయే ఎంఈడీ 4వ సెమిస్టర్‌ రెగ్యుల ర్‌, 1, 2, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ ప రీక్షల కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ.100 అపరాధ రుసుముతో 21 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.

కారులో పీపీపీ వీక్షించిన వేముల

వేల్పూర్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌నుంచి ఇ చ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌(పీపీపీ)ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కారులో ప్రయాణిస్తూ వీక్షించారు. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లిన వేముల రాంచీ నుంచి సోరె న్‌ స్వగ్రామానికి కారులో ప్రయాణిస్తూ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. అ నంతరం నిజామాబాద్‌లో పీపీపీని వీక్షించిన నాయకులతో మాట్లాడారు.

నిజాంసాగర్‌  నీటి విడుదల 
1
1/1

నిజాంసాగర్‌ నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement