
కాళేశ్వరంతో రాష్ట్రం ధాన్యగారమైంది
నిజామాబాద్‌అర్బన్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ధాన్యగారంగా మారిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించిన అనంతరం మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి జీవన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహాలను తొలగించేందుకే హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్, బీజేపీ సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తున్నామన్నారు. కేవలం కేసీఆర్‌ను అరెస్టు చేసేందుకే తప్పుడు నివేది కలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఓర్వలేని ద్రోహులంతా ఒకటై కేసిఆర్ పై కక్ష సాధింపు పాల్పడుతున్నారని విమర్శించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా బోగస్ కొట్టిపారేశారు. కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై జిల్లా నుంచి సమర శంఖం పూరిస్తామని ప్రకటించారు. నీరు లేక నోరు తెరిచిన నిజాంసాగర్‌ను కాళేశ్వరం ద్వారా నిండుకుండలా మా ర్చిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, సీనియర్ నాయకులు ప్రభాకర్, సత్యప్రకాశ్, సుజిత్ సింగ్ ఠాకూర్, జగన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
● బోగస్ నివేదికలతో తప్పుడు ప్రచారం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి