
గల్ఫ్ బాధితులను ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే..
ఖలీల్‌వాడి: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది కాంగ్రెస్‌పార్టే అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పి తీసుకురాలేదని అన్నారు. ఇటీవల వేల్పూర్‌లో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదని మాట్లాడడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సహాయ వివరాలను తెలిపేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకుడు దేవేందర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయడం సరైందని కాదని దీనిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు దాడి చేసే సంస్కృతి లేదన్నారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఎన్‌ఆర్‌ఐ పాలసీపై అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, విక్కీ యాదవ్, ప్రీతం, ప్రమోద్, శోభన్, జిల్లెల రమేశ్, అవిన్, బోటి వినోద్ కుమార్, నరేంద్ర సింగ్, సుంకెట విశాల్ తదితరులు పాల్గొన్నారు.