
క్రైం కార్నర్
రెండు గ్రామాల్లో దొంగల బీభత్సం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్‌పేట్, మర్కల్ గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారావ్‌పేట్ గ్రామానికి చెందిన షహరీ బేగం, ఉరుసు పుష్ప, ఒడ్డె రాములు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. మర్కల్ గ్రామానికి చెందిన గుర్రం పుష్ప, శాంత ఇళ్లకు తాళం వేసి ఉండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాగా, మర్కల్‌లో అర్ధరాత్రి ఓ కాలనీలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తుల దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. మర్కల్, ధర్మారావ్‌పేట్‌లో చోరీకి పాల్పడింది ఒకే ముఠానా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు. చోరీకి గురైన నగదు, బంగారం విలువ విచారణలో తెలుస్తుందని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్‌కుమార్ పరిశీలించారు. ఆయన వెంట సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సిబ్బంది ఉన్నారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ధర్మారావ్‌పేట్, మర్కల్‌లో చోరీకి పాల్పడ్డ
దుండగులు

క్రైం కార్నర్

క్రైం కార్నర్