
రూ.60 కోట్లతో 10 సబ్‌స్టేషన్ల నిర్మాణం
రెంజల్(బోధన్): విద్యుత్ వినియోగదారులతోపాటు రైతులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసేందుకు జిల్లాలో రూ. 60 కోట్లతో కొత్తగా 10 సబ్‌స్టేషన్‌లను నిర్మిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్ పేర్కొన్నారు. ఇప్పటికే మూడు చోట్ల పనులు ప్రారంభించగా మరో 7 పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. రెంజల్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం అదనంగా మూడు బ్రేకర్లను ప్రారంభించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళికతో కార్యాచరణ జరుగుతుందని వివరించారు. ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్‌లను గుర్తించి వాటి స్థానంలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను బిగించినట్లు తెలిపారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు లోడ్ పడకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 108 బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు టోల్‌ఫ్రీ నెంబర్ 1912ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో రూ. 40 కోట్ల వరకు బకాయిపడిన ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. ఆయన వెంట డీఈఈ వెంకట రమణ, ఏడీఈ తోట రాజశేఖర్, డీఈఈ ముక్తార్, ఏఈ మగ్ధుంతోపాటు ట్రాన్స్‌కో సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో రూ.40 కోట్ల
విద్యుత్ బకాయిలు
ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్