
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
మోపాల్/సిరికొండ : మోపాల్ మండలకేంద్రంతోపాటు సిర్‌పూర్, ముదక్‌పల్లి గ్రామాల్లో, సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకను నిర్వహించి కేక్‌కట్ చేసి పంచిపెట్టారు.ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి ఇరుగు పైడి మాదిగ,మోపాల్ ఇన్‌చార్జి రొడ్డ ప్రవీణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్, సిరికొండ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ సంపత్ ఉన్నారు.

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం