
గుమస్తా సంఘం అధ్యక్షుడిగా లాండేరి బాల్ అంజయ్య
సుభాష్‌నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ గుమస్తా సంఘం అధ్యక్షుడిగా లాండేరి బాల్ అంజయ్య (బాలు) విజయం సాధించారు. సోమవారం నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో గుమస్తా సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగగా, ప్రత్యర్థి కొక్కు నర్సయ్యపై లాండేరి బాల్ అంజయ్య 134 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. బాల్ అంజయ్య గతంలో సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు. అలాగే కార్యదర్శిగా గట్ల శ్రీనివాస్, కోశాధికారిగా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా రాజ్ గణేష్, సంయుక్త కార్యదర్శిగా శివప్రసాద్ ఎన్నికయ్యారు. అనంతరం గంజ్‌లో విజయోత్సవం సంబురాలు నిర్వహించారు. స్వీట్లు తినిపించి, టపాకాయలు కాల్చారు. నూతన అధ్యక్షుడు బాల్ అంజయ్యతోపాటు ఎన్నికై న కమిటీ సభ్యులకు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అధికారులు, వ్యాపారస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుంది.