
ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ : కార్మిక శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 282ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు. సోమవారం ఉదయం ధర్నాచౌక్ వద్ద నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వై.ఓమయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ముస్కె సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య మాట్లాడారు. జీవో నంబర్ 282లో వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో, కార్మికులతో రోజుకు 10 గంటలు పనిచేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని ఉందన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సాయన్న, రాములు, రవి, ఇమ్రాన్ అలీ, ప్రసాద్, కిరణ్, సురేష్, నవీన్, లక్ష్మీ, సాయిలు, నరసయ్య, గంగాధర్, గంగారం తదితరులు పాల్గొన్నారు.