
డిచ్‌పల్లి సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ల బిగింపు
డిచ్‌పల్లి: మండల కేంద్రం శివారులో గల 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొత్తగా రెండు బ్రేకర్లను బిగిస్తున్నారు. ఈ బ్రేకర్ల బిగింపు సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్, బీబీపూర్ తండ, ఘన్‌పూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయితే సుద్దపల్లి నుంచి లైను తీసుకుని డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ కు కొద్ది సేపు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్‌కో ఏఈ గంగారాం తెలిపారు. బ్రేకర్ల బిగింపు పనులు జరుగుతుండగా వర్షం రావడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రానికి ఒక బ్రేకర్ ఏర్పాటు పూర్తి కాగా, మంగళవారం రెండో బ్రేకర్ పనులు కొనసాగుతాయని ఏఈ తెలిపారు. మంగళవారం సైతం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.