
యువతపైనే దేశ భవిష్యత్
కమ్మర్‌పల్లి/బోధన్‌టౌన్ : దేశ భవిష్యత్ యువతపైనే ఉందని కమ్మర్‌పల్లి ఎస్‌ఐ అనిల్‌రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘మత్తు పదార్థాల నియంత్రణ’ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తుకు బానిసకావొద్దని సూచించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకులు మధు, రాజ్‌కుమార్, వెంకటేష్, గంగారాం, మహేందర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని బోధన్ పట్టణ ఎస్సై వెంకట నారాయణ అన్నారు. పట్టణంలోని విద్యావికాస్ జూనియర్ కాలేజీలో మత్తు పదార్థాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
సైబర్ నేరాలపై అవగాహన
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ తెలుగు మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం షీ టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు విఘ్నేష్, సుమతి మాట్లాడుతూ ఆన్‌లైన్ మోసాలను ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు.