
భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మోపాల్: మండలంలోని మంచిప్ప శివారులో ఎస్సీ కార్పొరేషన్ తమకు ఇచ్చిన 0.39 గుంటల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చాట్ల సాయన్న కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బాధితుడు చాట్ల సాయన్న తెలిపిన వివరాల ప్రకారం 0.39 ఎకరాల భూమిలో తన తండ్రి మాద్గి ఎల్లయ్య బతికి ఉన్నన్ని రోజులు వ్యవసాయం చేశాడని తెలిపారు. కొద్ది రోజులుగా తమ భూమికి పక్కన భూమి కలిగిన ఈదుల్ల గంగారాం, ఆయన అల్లుడు ఈదుల్ల ప్రవీణ్ కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. తమను బెదిరిస్తున్న ఈదుల్ల గంగారాం, ఈదుల్ల ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవాలని, తమ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. మోపాల్ తహసీల్దార్‌ను పరిశీలించాలని ఆదేశించినట్లు సాయన్న తెలిపారు. కార్యక్రమంలో పల్లాటి సాయిలు, కొంగల మౌనిక, పర్వవ్వ, డప్పు సుజాత, డప్పు బుచ్చమ్మ, చాట్ల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.