ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి

Jul 8 2025 4:28 AM | Updated on Jul 8 2025 4:28 AM

ఎస్సీ

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి

నిజామాబాద్‌అర్బన్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చట్టబద్ధతకు ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎనలేకి కృషి చేశారని, ఆయనకు మాదిగ జాతి రుణపడి ఉంటుందని మాదిగ ఉద్యోగులు అన్నారు. మందకృష్ణ పుట్టిరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో డ్రీమ్‌ల్యాండ్‌లో ఆయనను జిల్లా మాదిగ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలుమల సురేష్‌, ఉద్యోగులు నాంపల్లి, సందీప్‌ సోంనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు తెయూలో క్యాంపస్‌ సెలెక్షన్స్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో ఈనెల 9న తెయూ కెమిస్ట్రీ విభాగం, ప్ర ముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ హెటిరో సంయుక్తంగా క్యాంపస్‌ సెలెక్షన్స్‌ నిర్వహించనున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారితో పాటు ఈ విద్యాసంవత్సరం ఫైనలియర్‌ విద్యార్థులు క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులకు రాతపరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులకు నగదు అందజేత

ధర్పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి మూత రాజకుమార్‌ నగదును అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన నరేష్‌కు రూ.5 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన కల్యాణ్‌ కు రూ.3 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

కోచ్‌ ఎస్సాముద్దీన్‌కు

అభినందనలు

నిజామాబాద్‌ నాగారం: జిల్లాకు చెందిన బాక్సింగ్‌ కోచ్‌ ఎస్సాముద్దీన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాక్సింగ్‌ మహిళ టోర్నమెంట్‌ కజకిస్తాన్‌ దేశంలో జూన్‌ 30 నుంచి ఈనెల వరకు జరిగింది. ఈటోర్నమెంట్‌లో మనదేశ క్రీడాకారులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈసందర్భంగా కోచ్‌గా వ్యవహారించిన ఎస్సాముద్దీన్‌ ఆధ్వర్యంలో దేశానికి పతకాలు రావడంపై మాజీ అథ్లెట్‌ సయ్యద్‌ కై సర్‌, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారు.

సార్వత్రిక సమ్మెకు మద్దతు

నిజామాబాద్‌ సిటీ : ఈనెల 9న నిర్వహిస్తున్న సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ప్రగతిశీల బీడీవర్కర్స్‌ యూనియన్‌, యుఎస్‌ఎఫ్‌ఐ మద్దతు తెలుపుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు బి. సూర్యశివాజీ, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గణేష్‌ తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో సూర్యశివాజీ, పార్టీ కార్యాలయంలో గణేశ్‌ మాట్లాడారు. వ్యవసాయరంగంలో స్వామినాథన్‌ సిఫార్సులను అమలు పరచాలని, ఉపాధిహామీ కూలీలకు రూ. 600 వేతనం ప్రకటించి, ఏడాదికి 200 పని దినాలను కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్‌, వి.పద్మ, సుప్రియ, పోశెట్టి, ఎల్‌.లక్ష్మి, అబ్దుల్‌, కవిత, భాను, ధనలక్ష్మి, గణేష్‌, వేణు, మహేష్‌, సందీప్‌, కిరణ్‌, విశాల్‌, శివాజీ పాల్గొన్నారు.

గుంజిళ్లు తీయడం శిక్ష కాదు

మోర్తాడ్‌: గుంజిళ్లు తీయడం శిక్ష కాదని అదొక సూపర్‌ బ్రెయిన్‌ యోగా అని రిటైర్డు అధ్యాపకులు అందె జీవన్‌రావు అన్నారు. సూపర్‌ బ్రెయిన్‌ యోగా అనే అంశంపై సోమవారం భీమ్‌గల్‌ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యార్థులకు గుంజిళ్లు తీయడంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. గుంజిళ్లు తీయడం వల్ల విద్యార్థులలో ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి రోజుకు తమకు వీలైనన్ని గుంజిళ్లు తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో స్వామి, ఉపాధ్యాయులు గట్టు ఈశ్వర్‌, రాజు, వాసుదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి 
1
1/4

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి 
2
2/4

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి 
3
3/4

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి 
4
4/4

ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement