
డ్రెయినేజీలో పేరుకున్న వ్యర్థాలు
● ఆర్టీసీ కాలనీలో దుర్వాసనతో
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
● మున్సిపల్ అధికారులు
స్పందించాలని వినతి
నిజామాబాద్‌అర్బన్ : నగరంలోని ఆర్టీసీ కాలనీలో హనుమాన్ ఆలయ రోడ్డులో గల మండి హోటల్ ఆహార వ్యర్థాలను స్థానిక డ్రెయినేజీలో పేరుకుపోయాయి. దీంతో కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కాలనీలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని మండీ హోటల్ కొనసాగుతుంది. ఆర్టీసీ కాలనీ వెనుక వైపు ఉన్న నివాస గృహాల మధ్య గల డ్రెయినేజీలోకి హోటల్ నుంచే వచ్చే వ్యర్థాలను మురుగు నీరు పైపులైన్‌ను కలిపారు. ఈడ్రెయినేజీ నుంచి మురుగునీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వ్యర్థాలు డ్రెయినేజీల్లో పేరుకుపోయాయి. దీంతో దుర్వాసన రావడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.అలాగే డ్రెయినేజీలను మున్సిపల్ సిబ్బంది శుభ్ర పర్చడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని పలు డ్రెయినేజీల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి మురుగు నీరు అక్కడే నిలుస్తోంది. వర్షం పడిన సమయంలో ఇంటిముందు, రోడ్డు ముందు హోటల్ వ్యర్ధాలు నీటితో పాటు బయటకు వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ నుంచే వచ్చే వ్యర్థాలను ప్రధాన డ్రెయినేజీలో కలపాలని కాలనీవాసులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

డ్రెయినేజీలో పేరుకున్న వ్యర్థాలు