
మహిళా ప్రాంగణాలకు పూర్వ వైభవం
పెర్కిట్(ఆర్మూర్): బీఆర్‌ఎస్ పాలనలో మరుగున పడిన మహిళా ప్రాంగణాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లోగల దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంలో సోమవారం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసుకున్న వారికి క్యాపింగ్ సెర్మనీ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసుకున్నవారు నిస్వార్థంగా సేవలందించాలన్నారు. అనంతరం కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేసి క్యాపింగ్ చేశారు. డబ్ల్యూసీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కమీషనర్ రాజు, శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు పాల్గొన్నారు.