
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
నవీపేట: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు సోమవారం వారు మండలంలోని ధర్మారం(ఏ), శివాజీ చౌక్ ప్రాంతాలలో తరచూ రో డ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. 2022 నుంచి 2024 వరకు ఈ రెండు ప్రాంతాలలో పలు ప్రమాదాలు జరుగగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ రామ్మోహన్, ఆడార్ మేనేజర్ వర్ష నిహంత్, ఇరిగేషన్ ఏఈ శ్రీధర్‌లు రోడ్డుకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాలను కొలిచారు. రోడ్డు విస్తీర్ణంపై స్థానిక వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో నిబంధనలు అతిక్రమించి ముందుకు వచ్చిన వ్యాపారులు స్వచ్ఛందంగా హద్దులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగనాత్, నవీపేట జీపీ కార్యదర్శి రవీందర్ నాయక్, స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.