
ఊపందుకున్న ఎవుసం
● జిల్లాలో 50 శాతం పూర్తయిన వరినాట్లు
● జోరుగా మొక్కజొన్న సాగు
● వలస కూలీలకు దండిగా ఉపాధి
ఆరుతడిని ఆదుకున్న వర్షం
బాల్కొండ: ఆరుతడి పంటల సాగుకు వర్షం సహకరిస్తోంది. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తూ పంటలకు జీవం పో స్తుంది. కురుస్తున్న వర్షాలతో రైతులు సాగు చేసిన మొక్కజొన్న, సోయా పంటలు పచ్చ దనాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రస్తు తం మొక్కజొన్నకు అన్నదాతలు యూరి యా మందును వేస్తున్నారు. ఆరుతడి పంటలను ఆదుకునేలా వరుణుడు కరుణించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎవుసం ఊపందుకుంది. కురుస్తున్న వర్షాలతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. రైతన్నలు సాగు పను ల్లో నిమగ్నమయ్యారు. ఒక పక్క కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో పొలాలను దమ్ము చేయిస్తూ.. మరో పక్క వరినారును తరలించి చకచకా నాట్లు వేయిస్తున్నారు. ఐతే, ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశ తో రైతులంతా సన్నాలే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటలన్నీ కలి పి 5.31 లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 4.37లక్షల ఎకరాలు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 50శాతం వరకు సాగైంది. మొక్కజొన్నకు మంచి ధర వస్తుండడంతో రైతులు వరి తర్వాత మొక్కజొన్నను ఎక్కువగా విత్తారు. సోయా గతేడాదితో పోలిస్తే ఐదారు వేల ఎకరాలు తగ్గింది.
వలస కూలీలతో వరినాట్లు
వరినాట్లు వేసేందుకు జిల్లాకు ఎప్పటిలాగే మ హారాష్ట్ర, యూపీ, ఏపీ, బిహార్, పశ్చిమ బెంగా ల్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చారు. వా రికి మధ్యవర్తులుగా ఉన్న మునీములు గ్రా మాల్లో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నా రు. తక్కువ సమయంలో నాట్లు పూర్తి చేయడంలో వీరికి పెట్టింది పేరు. ఆగస్టు చివరి వరకు జిల్లాలోనే ఉండి నాట్లు పూర్తిచేసుకుని వెళ్తారు. ఐతే, ఎనిమిది మంది 10 మంది ఉండే కూలీల బృందానికి ఎకరం నాటు వేస్తే రూ.4,500 నుంచి రూ.4,800 వరకు రైతులు చెల్లిస్తున్నారు.
సగం కోటా యూరియా ఖతం
సాగు పనులు పుంజుకోవడంతో యూరియా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 75వేల మెట్రిక్ టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపింది. ఇందులో ఇప్పటి వరకు 42,787 మెట్రిక్ టన్నులు జిల్లాకు రాగా, 30వేల మెట్రిక్ టన్నులు అమ్ముడుపోయింది. 12,700 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి తెలిపారు.
నల్గొండ నుంచి మహిళా కూలీలు..
ఐదేళ్లుగా డొంకేశ్వర్‌కు వసల కూలీలను తెప్పిస్తున్నా. ఈసారి కూడా నల్గొండ నుంచి ప్రత్యేకంగా మహిళలను, పశ్చిమ బెంగాల్ నుంచి మగ కూలీలను రప్పించాను. వారికి గ్రామంలోనే రెండు నెలలపాటు నివాస, భోజన సదుపాయం కల్పిస్తాం. నాట్లు పూర్తికాగానే తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తారు. – బార్ల వంశి, డొంకేశ్వర్
18 ఎకరాల్లో మూడు పంటలు..
నాకున్న 18 ఎకరాల వ్యవసాయ భూమిలో మూ డు రకాల పంటలు వేశా. వరి, పసుపు, సోయా పంటలను ఆరున్నర ఎకరాల చొప్పున వేయగా, అవసరం మేరకు యూరియా కొనుగోలు చేశాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం డబ్బులు సాగుకు ఉపయోగపడ్డాయి. – గోక గంగారెడ్డి, డొంకేశ్వర్
జిల్లాలో ఇప్పటి వరకు సాగైన ప్రధాన పంటలు (ఎకరాల్లో..)

ఊపందుకున్న ఎవుసం

ఊపందుకున్న ఎవుసం

ఊపందుకున్న ఎవుసం