
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
డిచ్‌పల్లి/ఇందల్వాయి/జక్రాన్‌పల్లి: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసు కుంటున్నట్లు ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి తెలిపారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి శివారులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ), ఇందల్వాయి, జక్రాన్‌ప ల్లి పరిధిలోని జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 35 కిలోమీటర్ల రహదారిపై గత మూడేళ్లలో 30 ప్రాంతాల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నా రు. హైవే అథారిటీ, ఇందల్వాయి అతాంగ్ టోల్‌ప్లా జా ఆధ్వర్యంలో ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా ప్రదేశాల్లో సర్వీసు రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టారని చెప్పారు. సీఎంసీ వద్ద వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, నిర్మాణ పనులు పూర్తికావడానికి కొద్ది నెలల సమ యం పడుతుందన్నారు. ఆయన వెంట డిచ్‌పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్పై సందీప్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి పోలీసు సిబ్బంది, హైవే అథారిటీ, టోల్‌ప్లాజా సిబ్బంది ఉన్నారు.
హైవేపై బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి