సెక్యూరిటీ గార్డు కొడుకు కాబోయే డాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డు కొడుకు కాబోయే డాక్టర్‌

Jun 15 2025 7:18 AM | Updated on Jun 15 2025 7:18 AM

సెక్యూరిటీ గార్డు కొడుకు కాబోయే డాక్టర్‌

సెక్యూరిటీ గార్డు కొడుకు కాబోయే డాక్టర్‌

నవీపేట: మెడికల్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మండల కేంద్రంలోని లింగంగుట్టకు చెందిన దర్శనాల గంగాధర్‌ తన కొడుకును ఎంబీబీఎస్‌ చదివిస్తున్నాడు. ప్రతి రోజూ తన కళ్ల ముందు కనిపించే వైద్యవిద్యార్థులను చూస్తూ కొడుకును సైతం డాక్టర్‌ని చేయాలని కలలుగన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తే వచ్చే జీతం సరిపోకపోవడంతో ఉదయం వేళలో భార్య అన్నపూర్ణతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు సిద్ధార్థ ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement