ప్రగతి రథం.. ఆ పల్లెలకు దూరం
మాక్లూర్: గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండలాలకు వెళ్లాలంటే ఎక్కువగా ఆర్టీసీ బస్సునే ఆశ్రయిస్తారు. సురక్షిత ప్రయాణంతోపాటు ప్రైవేటు వాహనాలతో పోలిస్తే తక్కువ చార్జీలు.. అందుకే ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలకు మొగ్గుచూపుతారు. కానీ, టీఎస్ ఆర్టీసీ మాత్రం పలు పల్లెలకు బస్సులు నడిపేందుకు మొగ్గు చూపడం లేదు.
పుష్కరకాలం నుంచి బస్సుల్లేవ్..
మాక్లూర్ మండలంలో చాలా గ్రామాలకు పుష్కరకాలం నుంచి బస్సులు నడవడం లేదు. దీంతో ప్రజలు ఐదారు కిలోమీటర్ల మేర కాలినడక వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కాలినడక వెళ్లే మహిళలపై దుండగులు దాడులు చేసి గొలుసు చోరీలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మండలంలోని వల్లభాపూర్, మెట్‌పల్లి, రాంపూర్, వెంకటాపూర్, గంగరమంద, డీకంపల్లి, అమ్రాద్‌తండా, సట్లాపూర్ తండాలకు పల్లె వెలుగు బస్సు కనిపించక ఏళ్లు గడిచాయి. లక్నాపూర్ గ్రామానికి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు. ఇక ఉన్నత చదువుల కోసం వెళ్లే పట్టణాలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. చదువుకోవాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మండలంలోని చాలా గ్రామాలకు బీటీ రోడ్లు కూడా ఉన్నాయి. కానీ, ఆర్టీసీ బస్సు నడపకపోవడంలో ఆంతర్యమేమిటోనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామ ముఖచిత్రం
బస్సు ఎక్కాలంటే నడవాల్సిన దూరం
గ్రామం బస్సు ఎక్కే ప్రాంతం కి.మీ
రాంపూర్ వేణు కిసాన్‌నగర్ 7
వెంకటాపూర్ మెట్టు 5
మెట్‌పల్లి జన్నెపల్లి 5
అమ్రాద్ తండా అమ్రాద్ 4
వల్లభాపూర్ జన్నెపల్లి 3
సట్లాపూర్ తండా మదనపల్లి 3
మదన్‌పల్లి తండా మదన్‌పల్లి 2
లక్నాపూర్ ఆంధ్రానగర్ 3
నేటికి ఆర్టీసీ బస్సుకు
నోచుకోని పలు గ్రామాలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నప్పటికీ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ కాలినడకన నడిచి గమ్యానికి చేరుకుంటున్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలి
మండలంలో బస్సు సౌకర్యం లేని పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు , పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి.
– బి.నర్సయ్య(మెట్‌పల్లి), మాక్లూర్
పదేళ్ల నుంచి బస్సు రాలే..
మా గ్రామానికి బస్సు రాక పదేళ్లు అవుతుంది. మెరుగైన బీటీ రోడ్డు ఉంది. కా నీ బస్సు సౌకర్యం క ల్పించడం లేదు. బ స్సు ఎక్కాలంటే నాలుగు కిలో మీటర్లు నడవాల్సిన పరిస్థితి.
– మూడా గోవింద్ నాయక్,
అమ్రాద్ తండా, మాక్లూర్
ప్రగతి రథం.. ఆ పల్లెలకు దూరం
ప్రగతి రథం.. ఆ పల్లెలకు దూరం
ప్రగతి రథం.. ఆ పల్లెలకు దూరం


