జక్రాన్‌పల్లి: వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జక్రాన్‌పల్లి ఎంఈవో శ్రీనివాస్ అన్నారు. జక్రాన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం వేసవిశిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. శిబిరంలో నృత్యం, చిత్రలేఖనం, కరాటే, యోగా, కంప్యూటర్ కోర్సులలో ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 24వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. హెచ్‌ఎంలు లింగన్న, శ్రీనివాస్‌రెడ్డి, ముత్యంరెడ్డి, రాజు, సత్యనారాయణ, పద్మావతి, పీఆర్టీయూ ప్రతినిధులు గోపి, అశోక్ పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈవో రాములు శనివారం ప్రారంభించారు. ఈ శిబిరం ఈ నెల 25 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నృత్యం, కరాటే, యోగా, ఎంబ్రాయిడరీ లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నగరంలో..
నిజామాబాద్ రూరల్: నగరంలోని రామకృష్ణ విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. శిబిరంలో యోగా, చెస్, భగవద్గ్గీత పారాయణం, కంఠస్థ విషయాలు నేర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అంజేశారు. నిర్వాహకులు ఎస్‌ఎన్ చారి, హెచ్‌ఎం శశిరేఖ శ్రీనివాస్, కరస్పాండెంట్ సముద్రాల మధుసూదనాచారి, మాధురి తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి