
ఆరె కటికలు రాజకీయాల్లో ఎదగాలి
నిజామాబాద్‌నాగారం: ఆరె కటికలు రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఎదగాలని ఆరె కటిక రాష్ట్ర ట్రస్టు చైర్మన్ గౌలికార్ నర్సింగరావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర ఆరె కటిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆరెకటికలు వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగాలన్నారు. రాజకీయాధికారం అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు జమాల్పూర్ రమేష్ మాట్లాడుతూ.. ఆరె కటికల ఆత్మ గౌరవం పెరిగే విధంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర నాయకులు రవిలాల్, మురళీధర్, జితేందర్, సంజయ్‌రాజ్, నాగోజి, నెహ్రూ బియ్యకర్, బిల్లి శంకర్, గాంధీ, మోహన్‌లాల్, శివ చరణ్, ఆంకార్ మహేష్, శంకర్, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్, రవి, ఆనంద్, శ్రీనివాస్, రాజేష్, జమాల్పూర్ గణేష్, రాజశేఖర్ ఉన్నారు. నగర ప్రధాన కార్యదర్శిగా న్యంతాబాద్ అశోక్, కోశాధికారిగా మిర్యాలకర్ ఓం ప్రకాష్, గౌరవ అధ్యక్షుడిగా ఆంకార్ రాజారామ్ ప్రమాణస్వీకారం చేశారు.