
కలిసొచ్చిన సీడ్ సాగు
మోర్తాడ్(బాల్కొండ): విత్తనోత్పత్తి కోసం వరి సీడ్ సాగు చేయించిన విత్తన కంపెనీలు రైతులకు ఎక్కువ ధర చెల్లించి వారిని ప్రోత్సహించాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరను కల్పించి రైతులకు మేలు చేశాయి. యాసంగి సీజన్‌లో సాగు చేసిన సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,400 ధర ప్రకటించిన కంపెనీలు ప్రభుత్వం బోనస్‌ను ప్రకటించడంతో అదనంగా రూ.500 చెల్లిస్తున్నాయి. అంటే సీడ్ విత్తనం సాగు చేసిన రైతులకు ఒక్కో క్వింటాల్‌కు రూ.2,900 ధర లభిస్తోంది. సీడ్ కంపెనీలు గ్రామాల్లో తమ ఏజెంట్లను నియమించుకుని వారి మధ్యవర్తిత్వంతో రైతులతో బైబ్యాక్ ఒప్పందాలను చేసుకున్నాయి. వర్షాకాలంలో సన్న రకాలు సాగు చేసేందుకు అవకాశం ఉండటంతో సీడ్ రకం సాగులోనూ సన్నాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల్లో దాదాపు 4వేల ఎకరాల్లో విత్తన కంపెనీల కోసం వరి ధాన్యాన్ని రైతులు సాగు చేశారని అంచనా. పది కంపెనీల వరకూ తమ విత్తనోత్పత్తి కార్యక్రమం కోసం సీడ్‌ను సాగు చేయించాయి. ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి లభించింది. ఇదిలా ఉండగా సీడ్ రకం సాగులో కంపెనీలు సూచించిన ప్రకారం రైతులు మెళకువలు పాటించారు. ఫలితంగానే దిగుబడి పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మద్దతు ధరతో పోలిస్తే ఎక్కువే
చెల్లించిన కంపెనీలు
వర్షాకాలం సీజన్ కోసం
సాగు చేయించిన ప్రైవేట్ కంపెనీలు
సన్నాలకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం
ధర పెంచిన కంపెనీలు
ధర ఎక్కువ వస్తుందనే సీడ్ రకం సాగు చేశాం
ధర ఎక్కువగా వస్తుందనే సీడ్ రకం వరిని సాగు చే శాం. సీడ్ రకం వరి సాగులో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ధర ఎక్కువ చెల్లించడంతో రైతులకు మే లు జరిగింది. సీడ్ కంపెనీలు మరింత ధర పెంచితే సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశముంటుంది.
– మాదాం నర్సయ్య, రైతు, తొర్తి