
కాలువ లైనింగ్‌కు మరమ్మతులు చేపట్టరూ!
బాల్కొండ: శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు నీరు సరఫరా చేసే కాకతీయ కాలువ లైనింగ్ ధ్వంసమై, అధ్వానంగా మారింది. కాలువ నీటి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 6వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని వదిలే పరిస్థితి లేకుండాపోయింది. అలాగే చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదు. ధ్వంసమైన లైనింగ్‌కు యాసంగి సీజన్ ప్రారంభంలో మరమ్మతులు చేపడుతామని అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు చేపట్టలేదు. మరమ్మతుల కోసం గత ప్రభుత్వ హయాం నుంచి అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపిస్తున్నారు. కానీ నిధులు మంజూరు కావడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీసం లైనింగ్ ధ్వంసమైన ప్రదేశంలోనైనా మరమ్మతులు చేపట్టాలని, కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని రైతులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
కాకతీయ కాలువ లైనింగ్ మరమ్మతుల కోసం రూ.2.5కోట్ల అంచనాతో ప్రభుత్వానికి తాజాగా ప్రతి పాదనలు పంపించాం. మంజూరు కాగానే టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఈ ఏడాది చేసే పరిస్థితి లేదు.
– రఘుపతి, డిప్యూటీఈఈ, కాకతీయ కాలువ

కాలువ లైనింగ్‌కు మరమ్మతులు చేపట్టరూ!