
నెట్‌బాల్ రాష్ట్రస్థాయి టోర్నీకి జిల్లా జట్ల ఎంపిక
నిజామాబాద్‌నాగారం: నెట్‌బాల్ రాష్ట్రస్థాయి టోర్నీకి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ రూరల్ మండలంలోని తిర్మన్‌పల్లి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో అండర్–16 విభాగం బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయగా, వారు ఈ నెల 15 నుంచి 18 వరకు జనగామ జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనున్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు జనరల్ సెక్రెటరీ ఏ రమేశ్, పీఈటీలు గంగాధర్, నాగరాజ్, రమేశ్ గౌడ్, కుమార్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
బాలుర జట్టు:
జీ యశ్వంత్, జీ సామ్రాట్, వనితేజ్, వరుణ్ తేజ్, భువన్ తేజ్, ఎస్ విజయ్, టీ భరత్ కుమార్, వై అమర్, టీ మహేశ్, పీ నిఖిల్, టీ సంపత్, జీ స్పృహన్. స్టాండ్ బైగా పీ శేఖర్, స్వరాజ్ గౌడ్, సాత్విక్, నితిన్.
బాలికల జట్టు :
ఈ నయన శ్రీ, బీ అక్షయ, బీ సింధు, బీ మహిమ, కే నందిని, ఎం శ్రీహర్షిత, జీ నేహా, పీ లేయ, ఈ మృణాళిని, పీ అక్షయ, బీ గాయత్రి, కే మేఘన. స్టాండ్ బైగా జీ గీత. ఎం మహేశ్వరి, వీ శృతి, వీ సంధ్య, ఎస్ వైష్ణవి, ఎం రిషిత.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపర్చేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు, ఆసక్తి ఉన్నవారు మే 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.nimsme.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్‌కుమార్, సెల్ నంబర్ 9640909831ను సంప్రదించాలని సూచించారు.

నెట్‌బాల్ రాష్ట్రస్థాయి టోర్నీకి జిల్లా జట్ల ఎంపిక