
ఆటో బోల్తాపడి ఆరుగురికి గాయాలు
ఎల్లారెడ్డి: బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తాపడటంతో ఆటోలోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలో ప్రయాణికులను ఎక్కించుకొని ఓ ఆటో రుద్రారం బయలుదేరింది. పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట ఆటోకు ఎక్సెల్ వాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి బ్రేక్ వేయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నిజాంసాగర్‌కు చెందిన రజిత, సుమలత, ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సంగవ్వ, మల్కాపూర్ గ్రామానికి చెందిన శేర్ల చంద్రయ్య, శకుంతల, లక్ష్మీలకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షత గాత్రులను మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరామర్శించారు.
బైక్ అదుపుతప్పి ముగ్గురికి..
మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం బైక్ అదుపు తప్పడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పిట్లం నుంచి మద్నూర్ వైపు బైక్‌పై ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. మేనూర్ వద్ద వారి బైక్ అదుపు తప్పడంతో డివైడర్‌కు ఢీకొన్నారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆటో బోల్తాపడి ఆరుగురికి గాయాలు