
సైనికులకు అండగా నిలుద్దాం
నిజామాబాద్ రూరల్: మన దేశానికి, పాకిస్థాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైనికులకు అండగా నిలుద్దామని సినీనటి పూనమ్ కౌర్ అన్నారు. నగరంలోని నాందేవాడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా పూనమ్‌కౌర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత సైనికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడుతున్నారని ఇటువంటి సైనికులకు మనమంతా మద్దతు తెలుపుతూ అండగా నిలవాలన్నారు. గతంలో తాను పాకిస్తాన్ దేశంలో పర్యటించి అక్కడ శివాలయంలో పూజలు చేశానన్నారు. అనంతరం చిన్నారి ప్రదర్శించిన నాట్యం అలరించింది. బ్రహ్మకుమారి ఐశ్వర్య, నాందేవాడ సెంటర్ నిర్వాహకురాలు సునీత బహేంజీ తదితరులున్నారు.

సైనికులకు అండగా నిలుద్దాం