
భానుడి ఎఫెక్ట్
నిజామాబాద్
గృహజ్యోతికి
కానరాని గ్రామీణ క్రీడలు
పిల్లలు గ్రామీణ క్రీడలకు దూరమవుతున్నారు. శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దే క్రీడలను వదిలి సెల్‌ఫోన్లకు బానిసలవుతున్నారు.
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
– 10లో u
గృహజ్యోతి.. ఈ పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించేవారికి జీరో బిల్లు వర్తిస్తుంది. వేసవి నేపథ్యంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతోంది. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరమవుతున్నారు.
పెరిగిన
విద్యుత్ వినియోగం..
వేసవిలో రాష్ట్రంలోనే జిల్లా లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలో సగటు ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 వరకు నమోదు కాగా, ఏప్రిల్‌లో 42 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఎండ వేడిమికి వడగాల్పులు తోడుకావడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, చల్లదనం కోసం జోరుగా కూలర్లు వినియోగిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో 200 మిలియన్ యూనిట్ల వినియోగం కాగా, ఈసారి అంతకు మించి వినియోగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వినియోగం పెరగడంతో గృహజ్యోతి లబ్ధిదారుల ఇళ్లలో 200 యూనిట్ల పరిధి దాటుతోంది.
సుభాష్‌నగర్: పేదలకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతిపై భానుడి ప్రభావం పడింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు విద్యుత్ వినియోగం పెరిగి మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్ల వినియోగంతో ఏప్రిల్ నెలలో 62వేల కుటుంబాలు గృహజ్యోతి లబ్ధికి దూరమయ్యాయి.
జిల్లాలో నివాసగృహాలకు 4.80 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదల కోసం గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల కనెక్షన్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ కేటగిరీలో యూనిట్ ధర సాధారణంగా 1 నుంచి 50 యూనిట్ల వరకు రూ.1.95, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.10, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.80, 200 యూనిట్లు దాటితే రూ.5.10 చొప్పున బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 200 యూనిట్లు దాటిన వారికి రూ.వెయ్యికి పైగా బిల్లులు వస్తున్నాయి.
న్యూస్‌రీల్
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
పెరిగిన కూలర్లు, ఫ్యాన్ల వినియోగం
పరిధి దాటుతున్న విద్యుత్ యూనిట్లు
ఉచిత విద్యుత్ పథకానికి 62వేల కుటుంబాల దూరం
200 యూనిట్లు దాటితే వర్తించదు
విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వర్తించదు. ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం పెరిగింది. ఏప్రిల్‌లో 62 వేల కుటుంబాలు ఈ పథకానికి దూరంకాగా, 2.19 లక్షల కుటుంబాలకు మాత్రమే గృహజ్యోతి వర్తించింది.
– రాపెల్లి రవీందర్, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్

భానుడి ఎఫెక్ట్

భానుడి ఎఫెక్ట్

భానుడి ఎఫెక్ట్

భానుడి ఎఫెక్ట్