
గుప్పుమంటున్న గాంజా
● బానిసలుగా మారుతున్న యువకులు
● నగరంలో ముగ్గురు గంజాయి కింగ్‌లు
● దాడులు చేస్తున్నా తగ్గని సప్లైదారులు
● మైనర్లతో అమ్మకాలు
ఖలీల్‌వాడి: జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గుట్టుగా రవాణా అవుతోంది. పల్లెల్లో యువకులు కొందరు మత్తుకు బానిసలుగా మారారు. గంజా యి పీల్చడానికి అలవాటు పడి గమ్మత్తులో ఊగుతున్నారు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. పోలీసులు, ఎౖక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్ర మ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. స్మగర్లు గంజాయిని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో డంప్ చేస్తున్నట్లు పోలీసులు, ఎకై ్సజ్ వర్గాలు గుర్తించాయి. అవసరం మేరకు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ప్రాంతాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు.
మైనర్లతో విక్రయాలు..
టీ పాయింట్లు, ఖాళీ ప్రదేశాలు, గ్రామ శివారు ప్రాంతాలే అడ్డాగా గంజాయి దందా నడుస్తోంది. చాక్లెట్ ప్యాకెట్లు, లిక్విడ్ రూపంలో తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. నగరంలో గంజాయిని ముగ్గురు వ్యక్తులు అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. మరొకరు ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చినట్లు తెలిసింది. ఇంకొకరు మైనర్ల ద్వారా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం ముగ్గురు బాలురు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడగా, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. కాగా, ఓ బాలుడు మాత్రం తీరు మార్చుకోకుండా గంజాయి విక్రయిస్తూ కత్తులను వెంటబెట్టుకొని తిరుగుతున్నట్లు సమాచారం. ఆ బాలుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయగా పరారైనట్లు తెలిసింది.
ఏప్రిల్ 21న నవీపేట్ మండలం యంచ వద్ద కారులో రవాణా చేస్తున్న 30.250 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. రూ.6 లక్షల విలువజేసే గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.
ఫిబ్రవరి 11న నిజాంసాగర్ మండలం మాగి చౌరస్తా వద్ద 90.630 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి విలువ రూ.22.50 లక్షల ఉంటుంది.
నిఘా పెట్టాం
గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. నగరంలో కొంతమంది మైనర్లను అడ్డుపె ట్టుకొని గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. మైనర్లపై కూడా కేసులు నమోదు చేస్తాం. యువత గంజాయికి దూరంగా ఉండాలి. గంజాయి అమ్మకాలు, వినియోగంపై సమాచారం అందిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతాం. – స్వప్న, జిల్లా ఎకై ్సజ్
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌చార్జి ఏఈఎస్

గుప్పుమంటున్న గాంజా