
మందుల్లేవు.. వైద్యులు రారు
● నిజామాబాద్ నగరానికి చెందిన గంగవ్వ(58) ఈనెల 8వ తేదీన తన కొడుకుతో కలిసి కంఠేశ్వర్ ప్రాంతంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి బీపీ మందుల కోసం వచ్చింది. అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది.
నిజామాబాద్‌నాగారం: ఆరోగ్యభద్రతను ఇస్తాయనుకున్న ఈఎస్‌ఐ ఆస్పత్రులు మందులు లేక, టైమ్ కి వైద్యులు రాక వెలవెలబోతున్నాయి. ఉమ్మడి జిల్లా(నిజామాబాద్, కామారెడ్డి)కు సంబంధించి ఈఎస్‌ఐ ఆస్పత్రులు రెండు నిజామాబాద్ నగరంలోని రేడియోస్టేషన్ ప్రాంతంలో, కంఠేశ్వర్‌లో ఉ న్నాయి. అయితే సంఘటిత, అసంఘటిత కార్మికులు, జీతాల్లో ఈఎస్‌ఐ కట్ అయ్యే చిన్నచిన్న ఉ ద్యోగులు వైద్య సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు ఉండడం లేదని, వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వశాఖల్లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగు లు సుమారు 2వేల మందికిపైగానే ఉన్నారు. వీరి తోపాటు ప్రైవేట్ సంస్థల్లో ఆయా రంగాల్లో చిరుద్యోగులు, కార్మికులు సుమారు 13వేల వరకు ఉ న్నారు. న్యాల్‌కల్‌రోడ్‌లో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 10వేల కార్డులు ఉండగా, ప్రతినిత్యం 80మందికిపైగా చికిత్స కోసం వస్తుండగా, కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో 5వేలకు పైన కార్డు లు ఉన్నాయి. ఇక్కడికి ప్రతిరోజూ 50 మందికి పైగా రోగులు వస్తున్నారు.
లంచ్‌కి వెళ్తే అటే..
ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యులు, సిబ్బంది కచ్చితంగా అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించాలి. కానీ ఉ దయం వస్తున్న వారు లంచ్‌కి వెళ్తే మళ్లీ రావడం లేదు. ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్‌ల నిర్వహణను పట్టించుకునే వారు లేరు.
బీపీ బిళ్లలూ ఉండవు..
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీపీ, థైరాయిడ్, కొలస్ట్రాల్ తది తర మందులు లేవు. చిన్న పిల్లలకు సంబంధించిన మందులు సైతం ఉండడం లేదు. కేవలం జ్వరం, నొప్పుల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఫార్మసిస్టులు చెబుతున్నారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో
అడుగడుగునా ఇబ్బందులు
రోగులకు తప్పని ఇక్కట్లు
ఇలా వచ్చి అలా వెళ్తున్న వైద్యులు
పట్టించుకోని ఉన్నతాధికారులు
కామారెడ్డికి చెందిన రమేశ్ అనారోగ్యంతో బాధపడుతూ న్యాల్‌కల్ రోడ్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి గురువారం వచ్చాడు. వైద్యులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయాడు.
పర్యవేక్షణ లేదు
రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రులపై పర్యవేక్షణ లేకుండా పోయింది. రెండు ఆస్పత్రులను కలెక్టర్ ఒక సారి సందర్శిస్తే ఇక్కడి పరిస్థితి, అందుతున్న వైద్య సేవ ల వివరాలు తెలుస్తాయని రోగులు అంటున్నారు.