
ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి పూజలు
సుభాష్‌నగర్: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో భరతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సిందూర్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. యుద్ధంలో భారత సైన్యానికి, భూ భాగానికి, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత సైన్యం తలచుకుంటే పాకిస్తాన్‌ను ప్రపంచపటంలో లేకుండా చేస్తుందని హెచ్చరించారు. ప్రపంచ దేశా లు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారత్‌కు మద్దతిస్తున్నాయన్నారు. ప్రపంచదేశాలు భారత్‌ను ప్రశంసిస్తుంటే.. కొందరు మనవాళ్లే కించపర్చడం బాధాకరమని, వారిపై దేశద్రోహం కేసు పెట్టి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, కొండా ఆశన్న, ప్రభాకర్, మఠం పవన్, పల్నాటి కార్తీక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్