
గంజాయిపై ఉక్కు పాదం మోపండి
బాల్కొండ: గంజాయిపై ఉక్కు పాదం మోపాలని సీపీ సాయి చైతన్య పోలీసు సిబ్బందికి సూచించా రు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా పోలీస్ స్టేషన్‌లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. క్రైం రేట్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయిపై ఉక్కు పాదం మో పేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ స్టేషన్‌లలో 5ఎస్ విధానం తప్పకుండా అ మలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు చేపట్టాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైబర్ నేరాలపై మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సీపీ వెంట బాల్కొండ, ముప్కాల్, మెండోరా ఎస్సైలు నరేశ్, రజనీకాంత్, అర్ఫాత్, సిబ్బంది ఉన్నారు.