
నగరంలో నేడు 2కే రన్
నిజామాబాద్‌నాగారం: నగరంలో శనివారం వరల్డ్ లూపస్ డే సందర్భంగా రుమటాలజిస్ట్ గ్రీష్మ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఖలీల్‌వాడిలోని నిజామాబాద్ రుమటాలజీ, ఆర్థరైటీస్ సెంటర్ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడారు. కీళ్లవాతం(ఆర్థరైటీస్)లో లూపస్ అనేది ప్రమాదకరమైనదన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. లూపస్ అనేది ప్రాణాంతకమైనది కాకున్నప్పటికీ రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తుందని, పర్యావసనంగా అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. 2కే రన్‌కు ముఖ్య అతిథులుగా ఐఎంఏ అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్, సెక్రెటరీ విక్రమ్ రెడ్డి, ట్రెజరర్ రాజేందర్, వైద్యులు హాజరవుతారని, నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.