
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
నిజామాబాద్‌నాగారం: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. నగరంలోని అడిషనల్ కలెక్టర్ చాంబర్‌లో శుక్రవారం పీసీ అండ్ పీఎన్టీటీ యాక్టుపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా మూడు స్కానింగ్ కేంద్రాలకు అనుమతి, రెండు స్కానింగ్ కేంద్రాలకు రెన్యూవల్ చేశామన్నారు. బోధన్ డివిజన్‌లో ఒక స్కానింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అనుమతితో మూసివేసినట్లు తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో తనిఖీ బృందాలు ఒక్కొక్కటి చొప్పున, జిల్లా కేంద్రంలో అదనంగా మరో నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, కృష్ణ, న్యాయవాది సయ్యద్ ఇర్షద్‌బుకారి, ఏన్జీవో లింబాద్రి, ప్రోగ్రాం అధికారి సుప్రియ పాల్గొన్నారు.