
పీజీహెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం పీజీహెచ్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీజీహెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు శుక్రవా రం డీఈవోకు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో నిర్వహించే ఉపాధ్యాయు ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయి హెచ్‌ఎంలకు జిల్లా స్థాయి లో పీజీహెచ్‌ఎంలకు నిర్వహించే విధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే నూతన విద్యా సంవత్సరంలో నిర్వహించే కాంప్లెక్స్ స మావేశాల్లో పీజీహెచ్‌ఎంలకు కార్యదర్శి హోదా ఇవ్వాలన్నారు. ప్రాథమిక స్థా యిలో పర్యవేక్షణ కోసం అన్ని అర్హతలు ఉన్న పీజీహెచ్‌ఎంలకు మండల మాడల్ అధికారులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పీజీహెచ్‌ఎంలు రచ్చ మురళి, ప్రశాంత్ రెడ్డి, సురేశ్‌రెడ్డి, నరేశ్, సందీప్ పాల్గొన్నారు.