
ఏదీ.. వ్యవసాయ యాంత్రీకరణ!
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ ప థకం జాడ తెలియడం లేదు. వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచి అన్నదాతలకు కూలీల ఖర్చు భారాన్ని, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దే శంతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మార్చి చివరి వారంలో ప్రారంభించిన ఈ పథకానికి సరైన విధి విధానాలు లేక ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం మహిళా రైతులకు పెద్దపీ ట వేస్తూ సాగుకు ఉపయోగపడే యంత్రాలను రా యితీపై అందజేసేందుకు మార్చి నెలాఖరుకల్లా ద రఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయా లని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత శాఖ అధికారులు ఈ పథకంపై సరైన ప్ర చారం చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విధి విధానాలు లేక
ముందుకు సాగని పథకం
జిల్లాకు రూ.117.84 లక్షలు మంజూరు
నెల రోజులైనా పూర్తికాని
లబ్ధిదారుల ఎంపిక
నిరుపయోగంగా బడ్జెట్
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అత్యధికంగా 534 పరికరాలు అందించేందుకు రూ.117.84 లక్షలు బడ్జెట్ కేటాయించింది. పథకంపై ప్రచారం, అవగాహన లేకపోవడంతో చాలా మంది ఆశావహులు, అర్హులు దరఖాస్తులు చేసుకోలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 50 పైగా మాత్రమే దరఖాస్తులు రావడాన్ని చూస్తే రైతులకు ఈ పథకంపై ఎంతమేరకు అవగాహన కల్పించారో తెలుస్తోంది. మరోవైపు ఈ పథకాన్ని ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ప్రకటించడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు ఈ సంవత్సరానికి క్యారీ ఓవర్ కావట్లేదని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో వచ్చిన దరఖాస్తులు కూడా ఆన్‌లైన్ కావట్లేదని, నిధులు క్యారీ ఓవర్ పూర్తయి ఆన్‌లైన్ ప్రక్రియ సజావుగా సాగితేనే లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ పథకం అమలుపై స్తబ్ధత నెలకొందని సంబంధిత శాఖ అధికారులు చెప్పడం విశేషం.