
వచ్చే నెల 14న జాతీయ లోక్‌అదాలత్
ఖలీల్‌వాడి: జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా యసేవాధికార సంస్థ చైర్ పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్‌లో అదనపు జిల్లా జడ్జి హరీష, న్యాయసే వా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావులతో కలిసి గురువారం బీమా కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్స్, అధికారులు, న్యాయవాదులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ యాక్సిడెంట్ కేసులలో నష్టపరిహారంపై బీమా కంపెనీలు, న్యా యవాదులు పరిష్కారించుకోవాలని, అందుకు స హాయ సహకారం అందిస్తామన్నారు. లోక్ అదాలత్‌లో రాజీపద్ధతిన అవార్డులు అందుకున్న దావాలలో బీమా కంపెనీల ద్వారా త్వరితగతిన నష్టపరిహార డబ్బులను కోర్టులో డిపాజిట్ చేయిస్తామని తెలిపారు. బాధితులకు చేరితే వారి ఆర్థిక అవసరాలకు పనికొస్తుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ బీమా కంపెనీల న్యాయవాదులు గోవర్ధన్, ఆనంద్ రెడ్డి, అంకిత, గణేశ్ దేశ్‌పాండే, ఎంవీ నరసింహారావు, వీ భాస్కర్, ఆర్ మోహన్, సదానంద్ గౌడ్, న్యాయవాదులు రఘువీర్ భూపాల్, రవీందర్, మహేశ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ లాలూ వంకదోథ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బీమా కంపెనీలు, న్యాయవాదులు
సహకరించాలి
జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి