వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం

May 7 2025 12:34 AM | Updated on May 7 2025 12:34 AM

వేసవి

వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం

నిజామాబాద్‌ రూరల్‌: రోజు రోజుకూ ఎడలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉపశమనం కోసం ప్రజలు శీతల పానియాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పండ్ల దుకాణాలు, జ్యూస్‌ సెంటర్ల వద్ద రద్దీ పెరుగుతోంది. సపోట, మామిడి, యాపిల్‌, పైనాపిల్‌, ద్రాక్ష, కర్భూజ తదితర జ్యూస్‌లను ప్రజలు సేవిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఖలీల్‌వాడీ, గాంధీచౌక్‌, గంజ్‌ రోడ్‌, సుభాష్‌నగర్‌, వినాయక్‌నగర్‌, పులాంగ్‌, గాయత్రీనగర్‌, రాజరాజేంద్ర చౌరస్తా, కోర్టు చౌరస్తా, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో జ్యూస్‌ పాయింట్లు, చెరుకు రసాల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కో రకం జ్యూస్‌ రూ.20 ల నుంచి రూ.50 ల వరకు విక్రయిస్తున్నారు. కాగా, వేసవి నేపథ్యంలో కొబ్బరి బొండాలకూ డిమాండ్‌ ఉంది. ఒక్కో కొబ్బరి బొండం ధర రూ.80 పలుకుతోంది. అత్యవసర పని నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చేవారితోపాటు నగర ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కొబ్బరినీరు, పండ్ల రసాలు సేవిస్తున్నారు.

ఎండ వేడి తట్టుకోలేక

పండ్ల రసాలను సేవిస్తున్న జనం

రోజుకో బొండం తాగుతా..

నేను రోజుకో కొబ్బరి బొండం తాగుతా. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాదు. అలాగే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పండ్ల రసాలను తాగుతాం. – షాదుల్లా, నగరవాసి

వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం 1
1/2

వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం

వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం 2
2/2

వేసవి తాపం.. జ్యూస్‌లతో ఉపశమనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement