పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ పట్టణంలో మంగళవారం డీజే టిల్లు సినిమా ఫేమ్ నేహా శెట్టి సందడి చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఎల్‌వీఆర్ షాపింగ్ మాల్‌ను మంగళవారం సినీనటి నేహాశెట్టి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా నేహా శెట్టితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, ఎల్‌వీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
బాల్కొండ: రైతులు రెవెన్యూ సదస్సులను స ద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. భూసమస్యల సత్వర పరిష్కారం కోసమే భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెండోరా మండల కేంద్రంలో, మండలంలోని బుస్సాపూర్‌లో మంగళవారం పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సదస్సులను పరిశీలించి, మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా పల్లెల్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరించబడుతాయన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులో చేసుకున్న దరఖాస్తులకు వెంటనే పరిష్కారం లభిస్తుందన్నారు. సదస్సులో హెల్ప్‌డెస్క్, జనరల్ హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజుగౌడ్, మెండోరా తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, వేల్పూర్ మార్కెట్‌కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.

ఆర్మూర్‌లో సినీనటి నేహాశెట్టి సందడి